టీటీ జాతీయ ర్యాంకింగ్ టోర్నీ లో సంచలనం సృష్టించిన శైలు

వాస్తవం ప్రతినిధి: సౌత్‌జోన్‌ జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి శైలు నూర్ బాషా సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో శైలు 5–11, 11–8, 11–7, 12–14, 6–11, 11–8, 11–9తో అంకిత దాస్‌ (పీఎస్‌పీబీ)పై గెలిచింది. బెంగాల్‌కు చెందిన అంకిత 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి అంకిత దాస్ పై శైలు విజయం సాధించి సంచలనం  సృష్టించింది.