‘దేవదాస్ ‘నుంచి ‘గణపతి’ సాంగ్.. రిలీజ్

వాస్తవం సినిమా:  నాగార్జున .. నాని కథానాయకులుగా ‘దేవదాస్’ సినిమా రూపొందుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తోన్న ఈ మల్టీ స్టారర్ పై అందరిలోనూ ఆసక్తి వుంది. తాజాగా రేపు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని దేవదాస్ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ లకలక లకుమీకర సాంగ్ ను ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు.
“లక లక లకుమీకరా లంబోదరా .. జగ జగ జగదోద్ధారా విఘ్నేశ్వరా . . లక లక లకుమీకరా లంబోదరా .. రకరకముల రూపాలు నీవే దొరా .. వెళ్లి రారా .. మళ్లీ రారా .. ఏడాదికోసారి మాకై దిగిరారా ..” అంటూ ఈ పాట కొనసాగుతోంది. ఈ సాంగ్ ట్యూన్ రెగ్యులర్ బీట్ లా ఉన్నప్పటికీ లిరిక్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చిన్న చిన్న పదాలతో మంచి ప్రయోగం చేశారు రామజోగయ్య శాస్త్రి. రకరక రూపాలు నీవేనురా అంటూ పాటను సాగించిన విధానం బాగుంది.అక్కినేని నాగార్జున, నానిలు ముల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

దేవదాస్ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు సింగిల్స్ ను యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. కాగా, ఇది మూడో సింగిల్. అక్కినేని నాగార్జున, నానిలు ముల్టీస్టారర్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్నది.