‘తాతగారు వాడిన ఆఖరి కారులో నా తొలిరోజు షూటింగ్‌కు వెళ్తున్నా ‘..

వాస్తవం సినిమా: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టీఆర్‌’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఇందులో అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. ఈరోజు నుంచి ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సందర్భంగా చిత్రీకరణలో పాల్గొనేందుకు సుమంత్‌ సెట్స్‌కు బయలుదేరారు. మరో విషయమేంటంటే.. సుమంత్‌ తాతగారి పాత్రలో నటిస్తున్నారు కాబట్టి ఆయన వాడిన కారులోనే సెట్స్‌కు బయలుదేరారట. ఈ విషయాన్ని సుమంత్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ కారులో ప్రయాణిస్తున్నప్పుడు తీసిన ఫొటోను పంచుకున్నారు. ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఏఎన్నార్‌ పాత్రలో నటించడానికి ఆయన వాడిన ఆఖరి కారులో నా తొలిరోజు షూటింగ్‌ను వెళ్తున్నా.’ అని ట్వీట్‌ చేశారు.