“నందమూరి”…అభిమానులకి “షాకింగ్ న్యూస్”..అరవింద సమేత..

వాస్తవం సినిమా: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నరన్న సంగతి తెలిసిందే..అయితే ఎన్టీఆర్ తండ్రి హటాన్మరణం ఒక్క సారిగా ఇండస్ట్రీ ని నందమూరి ఫ్యామిలీ ని ముఖ్యంగా అభిమానులని శోకసంద్రంలో ముంచేసింది..ఈ సినిమా ఆడియోని అంగరంగ వైభవంగా చేయాలని అనుకున్న సినిమా యూనిట్ హరికృష్ణ మరణంతో వెనకడుగు వేసింది.

Image result for aravinda sametha

అసలైతే ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 20న రిలీజ్ చేయాలని చూశారు. ఆడియో వేడుక జరుపాలని అనుకోగా అది కాస్త క్యాన్సిల్ అయ్యిందట..ఆడియో ఫంక్షన్ కి బదులుగా డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే ఈ సినిమా ఆడియోని విడుదల చేయనున్నారట..అయితే ఇక్కడ అభిమానులు నిరాశ చెందకుండా ఉండటానికి సినిమా యూనిట్ వారికోసం ఒక ఫంక్షన్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారట.

Image result for aravinda sametha

అక్టోబర్ 1 నుండి 10 మధ్యలో అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట…మార్కెట్ లోకి ఆడియో వదిలిన తరువాత ఓ  భారీ వేడుక చేయాలని చూస్తున్నారు…రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నసినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి..ఇక ప్రీ రిలీజ్ కి గెస్ట్ లుగా బాలయ్య , చంద్రబాబు  ఇద్దరు హాజరవుతారని సినిమా వర్గాలు చెప్తున్నాయి..అయితే ఆడియో ఫంక్షన్ లేకపోయినా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఉండటంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.