అగస్టా వెస్ట్ లాండ్ మనీ ల్యాండరింగ్ కేసులో త్యాగి కి బెయిల్

వాస్తవం ప్రతినిధి: అగస్టా వెస్ట్‌లాండ్‌ మనీ ల్యాండరింగ్‌ కేసులో వైమానిక దళ మాజీ చీఫ్‌ ఎస్‌పీ త్యాగి, ఆయన సోదరులకు పటియాలా హౌస్‌ కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసినట్లు తెలుస్తుంది. రూ లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు కోరింది. రూ 3600 కోట్ల అగస్టా ఒప్పందంలో పలు అక్రమ మార్గాల్లో కాంట్రాక్టును పొందేందుకు కోట్ల మొత్తం చేతులు మారాయని దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం కోర్టు ఎదుట హాజరు కావాలని 30 మందికి పైగా నిందితులకు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ సమన్లు జారీ చేశారు. కాగా అగస్టా స్కామ్‌తో సంబంధం ఉన్న విదేశీ సంస్థలు, వ్యక్తులు బుధవారం కోర్టు ఎదుట హాజరుకాలేదు.