మోదీ పై ప్రవీణ్ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఓట్లతో గెలిచి, ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రస్తుతం ముస్లిం మహిళల తరపు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ అనేది ముస్లిం వర్గం వ్యక్తిగత అంశమని.. ఆ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవాదం, హిందుత్వ నినాదాలతో అధికారంలోకి వచ్చిన మోదీ.. హిందూ దేశాన్ని, కశ్మీర్‌లో ఉన్న హిందువులను రక్షించాల్సిందిపోయి ముస్లింల వకాల్తాదారుగా వ్యవహరించడం బాగోలేదంటూ విమర్శించారు.మధుర లో జరిగిన ఒక సమావేశానికి హాజరైన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.