రేవంత్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం.. లీగల్ నోటీసులు జారీ

వాస్తవం ప్రతినిధి: ఇప్పటికే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మనుషుల అక్రమ రవాణా కేసులో రిమాండ్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది .జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ కేసులో కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డికి నోటీసు జారీ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు… తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారని రేవంత్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో 15 రోజుల్లో జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరవ్వాలని రేవంత్ రెడ్డితో పాటు 13 మందికి నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు.
కాగా,ఈ నోటీసులకు రేవంత్ స్పందించారు. తాను ఎన్నికల బిజీలో ఉన్నానని… ఈ కారణం వల్ల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు లేఖ రాశారు. మరోవైపు, రేవంత్ కు నోటీసులు అందడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.