పోలవరం గ్యాలరీని ప్రారంభించిన చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో ఆధ్యాయానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు స్పిల్ వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కుటుంబసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి గ్యాలరీ వాక్ చేశారు. గ్యాలరీలో నడవడం సంక్లిష్ట ప్రక్రియ కావడంతో వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో వైద్య బృందాలు, ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తరలించేందుకు బయట అంబులెన్సులను సిద్ధం చేశారు.
ఈ రోజు ఉదయం ప్రత్యేక బస్సుల్లో అమరావతి నుంచి హెలికాప్టర్‌లో కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు పోలవరం చేరుకోగా… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో పోలవరానికి వచ్చారు. పోలవరం గ్యాలరీ పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం ఫోటో ఎగ్జిబిషన్‌ను వీక్షించారు. సీఎం చంద్రబాబు వెంట వచ్చి మనువడు పోలవరం ప్రాజెక్టు దగ్గర హల్‌చల్‌ చేవారు. మరోవైపు ప్రజాప్రతినిధులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు పోలవరం గ్యాలరీ వాక్ దృష్ట్యా ప్రాజెక్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.