జూనియర్ ఎన్టీఆర్” కి చంద్రబాబు “కీలక” భాద్యతలు..

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి..అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తుకి ముందడుగు వేయడంతో అన్ని పార్టీల్లోనూ ఎన్నికల వేడి మొదలయ్యింది.. ఏ పార్టీతో.. ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందో..చివరికి ఎవరు ఎవరితో కలిసి ఉంటారో ఈ రాజకీయ చదరంగంలో ఇప్పటికిప్పుడు చెప్పడం అసాధ్యం ఒక పక్క వలసలు. మరో పక్క అలకలు..రెబెల్స్ ఇలా సవాలక్ష ఇబ్బందులు అన్ని పార్టీలకు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పార్టీలు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఇదిలాఉంటే


తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ ఇప్పుడు పార్టీలో కొత్త జోష్ నింపడానికి తీవ్ర కసరత్తులు చేస్తోంది..తాము బలంగా ఉండే ప్రాంతాలపై లెక్కలు వేస్తోంది.. 2009 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ తరపున ప్రచారం చేసే అంశంపై టి.టీడీపీ కొండంత ఆశలు పెట్టుకుంది..అయితే కొన్ని రోజుల క్రితం నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జూనియర్ ప్రచారానికి వస్తారో లేదో కూడా తెలియదు..


అయితే ఈ విషయంలో టీటీడీపీ లో భిన్నమైన వాదనలు విన్పిస్తున్నాయి..తన తండ్రి చనిపోయినప్పుడు చంద్రబాబు జూనియర్ వెన్నంటే ఉంటూ ఎంతో సాయం చేశారని ఈ సమయంలో జూనియర్ ని పార్టీ కొరకు ప్రచారం చేయమని అడిగితే కాదనడనే నమ్మకం మాకు ఉందని అంటున్నారు టీడీపీ నేతలు..మరో పక్క చంద్రబాబు ఈ సమయంలో కూడా నీచ రాజకీయాలు చేస్తున్నాడా..జూనియర్ తండ్రి చనిపోతేనే పార్టీలోకి వచ్చి ప్రచారం చేయాలా అంటూ కొంతమంది వాదనలు విన్పిస్తున్నారు..ఈ క్రమంలోనే


టీటీడీపీ నేతలు జూనియర్ ఏమంటాడో , ప్రచారానికి వస్తాడా రాదా అనే టెన్షన్ లో తలలు పట్టుకుంటున్నారట. అయితే జూనియర్ విషయంలో ఏదైనా క్లారిటీ రావాలంటే చంద్రబాబు ప్రకటన చేయాల్సి ఉంటుంది..అయితే తెలంగాణాలో పార్టీ మళ్లీ పుంజుకునేలా జూనియర్ తప్పకుండా ప్రచారానికి వస్తాడని కొంతమంది నాయకులు నమ్మకం పెట్టుకున్నారు. అయితే గతంలో లా జూనియర్ ని ప్రచారానికి వాడుకుని చివరిలో కూరలో కరివేపాకులా ఎక్కడ తీసిపడేస్తాడో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు..అయితే చంద్రబాబు జూనియర్ ని ప్రచారానికి వాడుకోవడం మాత్రమే కాదు టీడీపీ లో కీలక పదవిని ఎన్టీఆర్ కి కట్టబెట్టబోతున్నాడని అకూడా తెలుస్తోంది..అయితే ఎన్టీఆర్ సన్నిహితులు అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.