జనసేన ఎంపీ అభ్యర్ధిగా..రెబల్ స్టార్..??

వాస్తవం ప్రతినిధి:  ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ముందుగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజల మద్దతు తప్పని సరి ఇది జగమెరిగిన సత్యం..ఇక్కడ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్న వారి గెలుపుకి డోకా ఉండదనే విషయం అందరికి తెలిసిందే అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమలో తాను వేసే ప్రతీ అడుగు ఎంతో ఆచితూచి వేస్తున్నాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ వైసీపీలు అభ్యర్ధులని ప్రకటించే సమయం దగ్గరపడుతున్న దశలో పవన్ కూడా ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నాట..అందులో భాగంగానే 

ఈరోజు జనసేన పార్టీ మొదటి బీ ఫార్మ్ ని ముమ్మిడివరం శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని  బాలకృష్ణ కి ఇస్తున్నట్టుగా బహిరంగ ప్రకటన చేశాడు..తూగో జిల్లాలో అధికశాతం మంది బీసీలు ఉండటంతో పాటు పితాని కూడా శెట్టి బలిజ బీసీ వర్గానికి చెందినా వాడు అదేసమయంలో అక్కడ ప్రజలలో ఎంతో మంచి పేరుని సంపాదించుకోవడంతో పవన్ ఆ కోణంలో పితానికి సీటుని కన్ఫర్మ్ చేసేశారు..అయితే నెల రోజుల క్రిందటే ఈ సీటుని పితానికి ఇవ్వడానికి అన్నివిధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడట పవన్ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అత్యంత కీలకం అయిన పశ్చిమ డెల్టా ఎంపీ స్థానంపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది..

పశ్చిమగోదావరి జిల్లా డెల్టా ప్రాంతం నుంచీ ఎంపీ అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్  రెబల్ స్టార్ కృష్ణం రాజు పేరుని పరిశీలిస్తున్నారని టాక్  వినిపిస్తోంది..గత కొంతకాలంగా కృష్ణంరాజు బీజేపీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట అంతేకాదు బీజేపీ సైతం కృష్ణంరాజు కి గవర్నర్ పదవి ఇస్తానని ఆశ జూపి ఇప్పటివరకూ స్పందించలేదని దాంతో ఆయన బీజేపీ పై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది..ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎంతో వ్యూహాత్మకంగా ఈ ప్రతిపాదన నేతలముందుకు తీసుకువచ్చారట..డెల్టాలో అత్యంత బలమైన ఆర్ధికంగా నిలదొక్కుకున్న సామాజిక వర్గంగా పేరొందిన రాజులు డెల్టాలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు అనేది అందరికీ తెలిసిందే..

అయితే పార్లమెంట్ సీటుని గనుక రాజులకి కేటాయిస్తే ,అందులోనూ సినీ నేపధ్యం ఉన్న కృష్ణంరాజు లాంటివారికి ఇస్తే అటు ఆ సామాజిక వర్గం మద్దతు అదేసమయంలో ప్రభాస్ ఫ్యాన్స్..మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మద్దతు కూడా ఉంటుందని ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గం మద్దతుకూడా పుష్కలంగా ఉండటంతో గెలుపు ఎంతో సునాయాసంగా ఉంటుందనేది జనసేన పార్టీ అభిప్రాయం ఈ విషయంపై మరింత లోతుగా చర్చించి ఈ ప్రతిపాదనని నేరుగా రెబల్ స్టార్ ముందు పెట్టడానికి సిద్దమవుతున్నారట…అయితే ఈ విషయంలో రెబల్ స్టార్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని..ఆయన చేరిక ఇరువురికి లాభాన్ని ఇస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.