రంగారెడ్డి జిల్లా లో భారీ అగ్ని ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: రంగారెడ్డి జిలా శంషాబాద్ మండలం రాళ్లగూడ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్‌రోడ్డు పక్కన విద్యుత్ తీగలు తెగిపడటంతో మంటలు చెలరేగి, రూ.5లక్షల విలువైన మిషన్ భగీరథ పైపులు దగ్ధమైనట్లు తెలుస్తుంది. దీనితో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరోపక్క ఈ విద్యుత్ తీగలు తెగిపోవడంతో 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సేవలు పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.