జనసేనుడి” కోసం…“చంద్రబాబు” ఆరాటం..రీజన్ ఇదేనా

వాస్తవం ప్రతినిధి: ఏపీలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు, నాపై ఏపీ ప్రజలకి అపారమైన నమ్మకం ఉంది..ఎంతో అనుభవం ఉన్న వాడిని కాబట్టే ఏపీ ప్రజలు నూతన రాజధాని ని నా చేతుల్లో పెట్టారు..అంటూ గడిచిన నాలుగేళ్ల కాలంలో అరిగిపోయిన గ్రామా రికార్డ్ లా చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. తీరా చూస్తే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేంద్రం మనల్ని ఆదుకోలేదు తూచ్ అంటూ అమరావతి కోసం చదును చేసిన పచ్చటి పొలాలని చూపిస్తున్నారు..ఇదేమంటే అంతా బీజేపీ చేసిన దారుణం అంటూ మాట దాటేస్తున్నారు.


ఇదిలాఉంటే ఒక పక్క చంద్రబాబుకి సొంత పార్టీలో నేతలు సహకారం లేకపోవడం..ఎవరికి వారే యమునా తీరే అనేట్టుగా ప్రవర్తించడంతో బాబోరి కి ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది..మరో పక్క ఇంకోసారి అవకాశం వస్తుందో రాదోనని నేతల చేతివాటాలు…అభివృద్ధి లేమి..ఇంకోపక్క పక్కలో బల్లెంలా లోకేష్ బాబు తీరు వెరసి చంద్రబాబు కి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి…దాంతో చంద్రబాబు కి సహజంగానే సర్వేల మీద ఉన్న నమ్మకంతో టీడీపీ పై తన సొంత సర్వే చేయించుకున్నారట.


తీరా ఈ సర్వే రిజల్స్ చూసి చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయిందట..నాలుగేళ్ళు తిమ్మిని బమ్మి చేస్తూ సింగపూరు చూపిస్తూ కాపాడుకుంటూ వచ్చిన తన పచ్చ కోటకి రాబోయే ఎన్నికలతో బీటలు పడుతాయని ఆ సర్వేలో తేలడంతో ఒక్కసారిగా బాబు ఆందోళనలో పడిపోయారట..ఒక పక్క తెలంగాణలో టీడీపీ పూర్తి స్థాయిలో నష్ట పోయే పరిస్థితిలో పార్టీని కాపాడుకోవడానికి బద్ద శత్రువు అయిన కాంగ్రెస్ తో జతకట్టడానికి చంద్రబాబు వెనుకాడలేదు అలాంటిది గత ఎన్నికల్లో ఈదలేక ఈదలేక ఉన్న బాబు ని తనమద్దతు తో ఒడ్డున పడేసిన పవన్ వైపు ఆశగా చూస్తున్నారట చంద్రబాబు.


అంతేకాదు పవన్ తో చెలిమి కోసం తహతహలాడుతున్నారట..40 ఏళ్ల అనుభవం అన్నారు కదా అని సీనియర్స్ అంటే చస్ ఇలాంటివి కామనే ముందు పవన్ మద్దతు దొరికే ప్లాన్ చూడండి అంటూ నేతలకి హితబోదలు చేస్తున్నారట.అ.అందుకే పవన్ పుట్టిన రోజున తండ్రీ కొడుకులు ఇద్దరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు కూడా..అంతేకాదు పవన్ చెలిమి కోరుకుంటున్నట్లుగా రాయభారం కూడా పంపడం ఈ రాయభారాన్ని పవన్ తిరస్కరించడం కూడా జరిగిపోయట దాంతో వచ్చే ఎన్నికల్లోగా ఎలాగైనా సరే పవన్ తో దోస్తే చేయాలని పవన్ ని మచ్చిక చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నారట చంద్రబాబు నాయుడు అవునులెండి ఛీ అన్నా చా అన్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి కదా ఆ మాత్రం సర్దుకుపోరా అంటూ సెటైర్స్ వేస్తున్నారట చోటా మోటా నేతలు.