మూడో రోజు కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చిన మాల్యా

వాస్తవం ప్రతినిధి: భారత బ్యాంకులలో వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇటీవల భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన వీడియో ఒకటి నేట్టింట్లో హాల్ చల్ కూడా చేస్తుంది. అయితే ఇదే మ్యాచ్ మూడో రోజు కూడా మాల్యా స్టేడియం కి వచ్చినట్లు తెలుస్తుంది. మాల్యాకు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో లండన్‌ వేదికగా భారత్‌ ఏ మ్యాచ్‌ ఆడినా మాల్యా గ్యాలరీలో ప్రత్యక్షమవుతాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య చివరి టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు మ్యాచ్‌ను చూసేందుకు మాల్యా వచ్చాడు. గేటు వద్ద కారులో నుంచి దిగి మైదానంలోకి వెళ్తున్న మాల్యా వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇరు జట్ల మధ్య ఆదివారం, మూడో రోజు జరిగే మ్యాచ్‌ను చూసేందుకు మాల్యా మైదానానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ సేనను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ మాల్యా భారత ప్రభుత్వాన్ని కోరగా,దానికి భారత ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే.