ముందుగానే రిటైర్ అవ్వాలని అనుకున్నాడట!

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్ ఆటగాడు అలిస్టర్ కుక్ తన రిటైర్మెంట్ ని వారం రోజులు ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత్ తో జరిగిన చివరి ఐదో టెస్ట్ మ్యాచ్ లో కుక్ శతకం సాదించి తన చివరి మ్యాచ్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అయితే నిజానికి భారత్‌తో జరిగిన చివరి టెస్టుకు ముందే అంటే నాలుగో టెస్ట్ తరువాత కుక్ రిటైరవుదామని అనుకున్నాడట. కానీ, ఆ జట్టు కోచ్‌ ఒప్పుకోకపోవడంతో కుక్‌ భారత్‌తో ఐదో టెస్టు ఆడినట్లు సమాచారం. స్థానిక ఓ ఇంగ్లిష్‌ పత్రిక కథనం ప్రకారం పై విషయాలు వెల్లడయ్యాయి. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగే చివరి టెస్టులో కుక్‌ ఆడాలని అనుకోలేదు. ఈ నేపధ్యంలో ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు తర్వాతే కుక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించేద్దాం అనుకున్నాడట. ఈ క్రమంలో అతడు సెలక్టర్‌ ఎడ్‌ స్మిత్‌ను కూడా కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కానీ, స్మిత్‌ అందుకు ఒప్పుకోకుండా,భారత్‌తో చివరి టెస్టు ఆడాలని కోరి.. ఆ టెస్టు ఆడే జట్టులో కుక్‌ పేరు కూడా జత చేశాడట. దీనితో కుక్ చివరి టెస్ట్ లో కూడా ఆడాల్సి వచ్చింది. అయితే కుక్ ఎందుకు రిటైర్ అవ్వాలని అనుకున్నారు అంటే అతడి భార్య ఎలైస్‌ ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి. ఏ నిమిషంలోనైనా ఆమె బిడ్డకు జన్మనివ్వొచ్చు. ఇలాంటి సమయంలో ఆమె వెన్నంటే ఉండాలని భావించిన కుక్ చివరి టెస్టుకు అందుబాటులో ఉండలేనని స్మిత్‌కు వివరించాడు. కానీ స్మిత్ మాత్రం చివరి టెస్ట్ కూడా ఆడాలి అని కోరడం తో కుక్ చివరి టెస్ట్ వరకు జట్టుతోనే ఉన్నారు. భారత్‌తో ఐదో టెస్టు నాలుగో రోజు ఆటకి కుక్‌ భార్య ఎలైస్‌ ఇద్దరు బిడ్డలతో పాటు బంధువుల తో కూడా కలిసి హాజరైంది. కుక్‌ శతకం సాధించగానే ఎలైస్‌ చప్పట్లు కొడుతూ మైదానంలో సంబరాలు చేసుకుంది.