ఈ వీడియో మా వదిన కోసం..: అఖిల్

వాస్తవం సినిమా: వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న సమంత నటించిన యూ టర్న్ విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. విభిన్న కథతో కన్నడలో తెరకెక్కిన యూటర్న్ ను తెలుగులో సమంత లీడ్ రోల్ లో రీమేక్ చేశారు .ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా విడుదల చేసి కర్మ థీమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా సమంత….పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు కర్మ థీమ్ ఛాలెంజ్ ను విసిరింది.
దీంతో ఈ పాటలో ఆమె స్టెప్పులను అనుకరిస్తూ చిన్నారులు కూడా డ్యాన్సులు చేసి వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి..అఖిల్ ఊరుకుంటాడా ? వదిన సమంత కోసం మరది అఖిల్ స్టెప్పులేసి శభాష్ అనిపించాడు.వదిన మాదిరే తానూ డ్యాన్స్ చేసి.. ‘ ఈ వీడియోను మా వదిన కోసం ‘ అనే కామెంట్‌తో పోస్ట్ పెట్టాడు. పైగా సమంతకు అడ్వాన్స్ విషెస్ కూడా చెప్పాడు. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ యూటర్న్ ‘ చిత్రం ఈ నెల 13 న విడుదల కానుంది.