నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వాస్తవం ప్రతినిధి: ఈ రోజు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు… దీంతో టీటీడీ అధికారులు అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుంది.
మరోవైపు రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా… రాత్రి 7 గంటలకు మాడ వీధుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు ఊరేగనున్నారు. ఎల్లుండి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

13వ తేదీ సాయంత్రం 6.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ర్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు … 13 రాత్రి 8 గంటలకు శ్రీవారు పెద్ద శేష వాహనం పై తిరుమాధవీధుల్లో ఊరేగుతూ భక్తులుకు దర్శనమివ్వనున్నారు .
14న ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, రాత్రి 8 గంటలకు హంస వాహనము… 15న ఉదయం 9 గంటలకు సింహవాహనమ, రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహనం… 16న ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహనం… 17వ తేదీ ఉదయం 9 గంటలకు మోహిని అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం… 18వ తేదీ ఉదయం 9 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 8 గంటలకు గజ వాహనం… 19న ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం… 20న ఉదయం 7 గంటలకు మహారథం, రాత్రి 8 గంటలకు అశ్వ వాహనం… 21వ తేదీన ఉదయం 7 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.