స్థానిక ఎన్నికల ను బహిష్కరించిన పిడిపి పార్టీ

వాస్తవం ప్రతినిధి: జమ్మూ కాశ్మీర్‌లో వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) తాజాగా ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పత్రికా గోష్టిలో మాట్లాడుతూ ఈ విషయాన్నీ వెల్లడించారు. అలానే ఆర్టికల్‌ 35ఎను రద్దు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌ యొచనపై జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని, కావున కేంద్రం తన యోనచ విరమించుకోవాలని అమె కోరారు. జమ్మూ కాశ్మీర్‌లో మరో ప్రధాన పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) ఈ స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా ఇప్పుడు పీడీపీ పార్టీ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్‌35ఎపై వేటు వేయాలన్న యోచనను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసు కోకుంటే 2019 పార్లమెంటు ఎన్నికలను కూడా బహిష్కరించాల్సి వస్తుందని ఎన్ సి పార్టీ హెచ్చరించింది. అయితే ఇప్పుడు పిడిపి కూడా అదే మార్గం ఎంచుకుంది. ఆర్టికల్‌ 35ఎకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడంలో అర్థం లేదని పిడిపి నేతలు పేర్కొన్నారు.