కాబూల్ లో విరుచుకుపడ్డ తాలిబన్లు

వాస్తవం ప్రతినిధి: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో 29 మంది సిబ్బంది మరణించినట్లు తెలుస్తుంది. 1980ల్లో సోవియట్‌ యూనియన్‌ ఆక్రమణకు, 1996–2001 మధ్య తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌ 17వ వర్ధంతి సందర్భంగా తాలిబన్లు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. మరోవైపు మసూద్‌ మద్దతు దారులు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయుధాలను చేతపట్టి వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తుండగా, ఆ వాహన శ్రేణి వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకోవడంతో ఏడుగురు మరణించారు. ఆత్మాహుతి దాడికి యత్నిస్తున్న మరో ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భద్రతా దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 50 మందికిపైగా తాలిబన్‌ ఉగ్రవాదులు మరణించారని అఫ్గాన్‌ అధికారులు చెప్పారు.