ఆసియా కప్ లో హాంగ్ కాంగ్ కు వన్డే హోదా

వాస్తవం ప్రతినిధి: ఆసియాకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌లతో హాంకాంగ్‌ ఆడే మ్యాచ్‌లకు ఐసీసీ వన్డే హోదా కల్పించినట్లు తెలుస్తుంది. అర్హత టోర్నీ ద్వారా ఆసియా కప్‌కు ఎంపికైన హాంకాంగ్‌కు ఇప్పటివరకు వన్డే హోదా లేదు. ఆ జట్టుతో వన్డే హోదా ఉన్న జట్లు ఆడినా ఐసీసీ వాటిని అధికారిక వన్డేలుగా గుర్తించదు. ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ ఉన్న గ్రూప్‌లో హాంకాంగ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుతో జరిగే మ్యాచ్‌లకు అధికారిక హోదా కట్టబెట్టాలని ఆసియా క్రికెట్‌ మండలితో పాటు బీసీసీఐ కోరగా అందుకు ఐసీసీ అనుమతించింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ మరో గ్రూప్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 15న ఆసియా కప్‌ ఆరంభంకానుంది.