మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకున్న జోకోవిచ్

వాస్తవం ప్రతినిధి: ఈ సీజన్‌ అత్యుత్తమ ఫామ్ లో ఉన్న నోవాక్ జోకోవిచ్(సెర్బియా) మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌ మ్యాచ్‌లో మాజీ విజేత(2009) డెల్‌పొట్రోపై ఘన విజయం సాధించి మూడో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో ఆరో సీడ్‌ జొకోవిచ్‌ 6-3, 7-6,(7/4), 6-3తో అర్జెంటీనా ఆజానుబావుడు డెల్‌పొట్రోపై విజయం సాధించాడు. మ్యాచ్‌ ఆద్యంతం సెర్బియా వీరుడు తన ఫామ్‌ను కొనసాగించడం తో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.