ఆ విషయంలో తెలంగాణ, ఆంధ్రా తేడా లేదంటున్న దేవరకొండ

వాస్తవం సినిమా: విజయ దేవరకొండ ఇప్పుడు ఇండస్ట్రీ లో ద మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరో. తాజా గా వచ్చిన గీత గోవిందం సినిమా హిట్ తో మనోడి క్రేజ్ మరింత గాపెరిగి పోయింది. అమ్మాయిల కలల రాకుమారిడిలా మారి పోయాడు. అయితే విజయ దేవరకొండ తన పెళ్లి గురించి స్పందించాడు. ’40 ల్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఎంత లేట్ గా పెళ్లి చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటాం కదా. తొందరగా పెళ్లి చేసుకొని ఏంచేయాలి. అందుకే ఒకప్పుడు 40ల్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ 35 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని రీసెంట్ గా నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో నా నిర్ణయాన్ని 30కి తీసుకొస్తానేమో చూడాలి.” పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం తనవల్ల కాదంటున్నాడు దేవరకొండ. ఎంచక్కా మనసుకు నచ్చిన పిల్లను చూసి సెట్ చేసుకుంటానంటున్నాడు. ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రా తేడా లేదంటున్నాడు. ఎరేంజ్డ్ మ్యారేజ్ నావల్ల కాదు. లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. ప్రస్తుతానికైతే మైండ్ లో ఏ అమ్మాయిలేదు.ఈ విషయంలో కొంచెం టైం తీసుకుంటాను. అమ్మాయి తెలంగాణ, ఆంధ్రా అనే తేడాలేదు. వరల్డ్ లో ఎక్కడ్నుంచి అయినా, ఎవరైనా నాకు నచ్చొచ్చు. నా మైండ్ సెట్ కు కనెక్ట్ అయితే చాలు. తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయంపై కూడా విజయ్ కు ఓ క్లారిటీ ఉంది. ఒకే గదిలో కొన్నిరోజుల పాటు గడిపినా బోర్ కొట్టకుండా ఉండాలని, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ సరదాగా ఉంటే అదే చాలంటున్నాడు ఈ యంగ్ హీరో..!