భారత్‌ బంద్‌ సందర్భంగా జనసేన కార్యకర్తల భారీ ర్యాలీ

వాస్తవం ప్రతినిధి: పెట్రో మంటలు చల్లార్చడంలో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విపక్షాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ దేశవ్యాప్తంగా కొనసాగింది.పలు రాష్ట్రాల్లో కార్యకర్తలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేశారు.
ముంబై చెన్నై జాతీయ రహదారి లోని ఏకశిలా నగరం ఒంటిమిట్ట హైవేలో సోమవారం ఉదయం పెంచిన పెట్రోల్ డీజిల్ కు నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
మండల ఇంచార్జ్ ఏలేశ్వరం మధు స్వామి ఆధ్వర్యంలో దుకాణాలు బంద్ కార్యక్రమం మరియు హైవేలో రాస్తా రోకో కార్యక్రమం జరిగింది .ఈ సందర్భంగా జనసేన మండల ఇన్చార్జి నాయకుడు మధు స్వామి మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు సుబ్బరాయుడు మురళి నాగరాజు హరిబాబు రామ కృష్ణ భాస్కర్ రెడ్డి వెంకట శ్రావణ్ కుమార్ చిన్నబాబు జనార్ధన్ మరియు గాలి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.