సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో మాజీ డీఐజీ కి ఊరట!

వాస్తవం ప్రతినిధి: గ్యాంగ్‌స్టర్‌ సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్‌ కేసులో గుజరాత్‌ మాజీ డీఐజీ డీజీ వంజర, ఐఏఎస్‌ అధికారులు దినేష్‌, రాజ్‌కుమార్‌ పాండియన్‌లకు విముక్తి లభించినట్లు తెలుస్తుంది. కేసు విచారణ సందర్భంగా వీరిపై అభియోగాలు కొట్టివేయడానికి తాను వ్యతిరేకం కాదని  సీబీఐ స్పష్టం చేయడంతో వీరిపై అభియోగాలను బాంబే హైకోర్టు సోమవారం కొట్టివేసింది. 2005-2006లో సోహ్రబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బీ, వారి సహచరులు తులసీరాం ప్రజాపతి ఎన్‌కౌంటర్‌ కేసు నుంచి తనను తప్పించాలని గుజరాత్‌ ఐపీఎస్‌ అధికారి విపుల్‌ అగర్వాల్‌ దరఖాస్తును కోర్టు అనుమతించింది. కాగా ఈ కేసు నుంచి గుజరాత్‌ మాజీ డీఐజీ వంజర, ఐపీఎస్‌ అధికారులు ఎంఎన్‌ దినేష్‌, పాండియన్‌లను తప్పించడాన్ని సవాల్‌ చేస్తూ సోహ్రబుద్దీన్‌ సోదరుడు రుబాబుద్దీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీనితో ఈ నిర్ణయాన్ని ఆయన న్యాయవాది గౌతమ్ తివారి తప్పుపట్టారు.