12న కాంగ్రెస్‌లోకి కొండా సురేఖ

వాస్తవం ప్రతినిధి: కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిలు ఈ నెల 12వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారయిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి, కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం ప్రకటించనున్నారని సమాచారం. ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 11 మందిని ప్రకటించిన కేసీఆర్, కొండా సురేఖ ప్రాతినిథ్యం వహించిన వరంగల్ తూర్పును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.