“ఆపరేష్ గరుడ ” – “ఎన్టీఆర్ భవన్ ” లకి సంబంధం ఏమిటి.?

వాస్తవం ప్రతినిధి: ఆపరేష్ గరుడ అసలు ఈ పేరు ఆంధ్రా పాలిటిక్స్ లో పెను సంచలనమనే చెప్పాలి..కేంద్రం బాబుని టార్గెట్ చేసింది ఎలాగైనా అరెస్ట్ చేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ని ఓడించి వైసీపీని అక్కున చేర్చుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే మోడీ ఆపరేషన్ గరుడ మొదలు పెట్టారు..అంటూ టాలీవుడ్ లో అవకాశాలు కోల్పోయిన మాజీ హీరో శివాజీ గత సంవత్సర కాలంగా సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు..అయితే అటు పొలిటీషియన్ కాదు ఇటు హీరో కాదు మరి అటు ఇటు కాని వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవడం అని వదిలి పడేసిన ప్రతీసారి మీడియా ముందుకు వచ్చి మరీ హడావిడి చేస్తూ ఉంటాడు శివాజీ..

సరే అసలు ఆపరేష్ గరుడ ఎక్కడ పుట్టింది..? ఎవరి కనుసన్నల్లో నడుస్తోంది..? దేనికి మూలాలు ఎక్కడ అనే దానికి బీజేపీ నేత ఇచ్చిన క్లారిటీ తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది..ఇక వివరాలలోకి వెళ్తే…ఏపీలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ గరుడ రూపు మార్చుకుందని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ శివాజి మరో మారు సంచలన ఆరోపణ చేసిన సంగతి విదితమే. అయితే ఈ క్రమంలోనే తనకు ప్రాణహాని ఉందని హీరో శివాజీ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.. “ఇప్పటికే రెండు సార్లు” అంటూ కీలక అంశాన్ని అస్పష్టంగా ముగించి.. మీడియా లేకపోతే తాను ఎప్పుడో చనిపోయేవాడని తెలిపారు.

బీజేపీ నిన్నా మొన్నటి వరకూ పీడీ అకౌంట్స్ అని చెప్పి గోల గోల చేసిన విషయం విదితమే అయితే ఇప్పుడు మరో రూపంలో బాబు పై పగ తీర్చుకోవాలని నిర్ణయం తీసుకుందని శివాజీ ఆరోపణలు చేశారు అయితే ఈ ఆరోపణలని ఖండిస్తూ శివాజీపై బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ “ఆపరేష్ గరుడ” అనేది అసలు లేదని ఇదంతా చంద్రబాబు తాజా ఎత్తుగడల్లో భాగమేనని శివాజీ ఎపీసోడ్ చంద్రబాబు పుణ్యమేనని విమర్శలు తిప్పికొట్టారు..అంతేకాదు ఆపరేషన్ గరుడ కి అసలు మూలం ఎన్టీఆర్ భవన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు..ఈ విషయంలో పక్కా సమాచారం ఉందని ఆయన ఫైర్ అయ్యారు.

టీడీపీ-కాంగ్రెస్ పొత్తు చాలా నీచమైన చర్యలని ఎన్టీఆర్ ఆత్మ క్షోబిస్తుందని ఈ పొత్తుపై దృష్టి మరల్చడానికి శివాజీని తెరపైకి తీసుకువచ్చి ఆపరేష గరుడ అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శలు చేశారు…ఐదు నెలల క్రితం శివాజీ ఇదే ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడారు..అందులో ఏ ఒక్కటైనా నిజమైందా అని సూటిగా ప్రశ్నించారు..బాబు కి రెండు కళ్ళ సిద్దాంతం, రెండు నాల్కుల ధోరణి ఉందన్న విషయం అందరికీ తెలుసునని ఇప్పుడు బహిరంగం అయ్యిందని ఆయన మండిపడ్డారు..అన్ని విషయాలు త్వరలోనే బయటపడుతాయని బీజేపీ పై విమర్శలు చేసిన శివాజీ కి బుద్ది చెప్పే రోజు ఒకటి వస్తుందని ఆయన ఫైర్ అయ్యారు.