నేలకూలిన విమానం….ఆరుగురు మృతి!

వాస్తవం ప్రతినిధి: నేపాల్ లో ఒక విమానం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఏడుగురి తో ప్రయాణిస్తున్న ఆ విమానం ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. అయితే ఆ విమానం నేపాల్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో శనివారం కూలిపోవడంతో, ఆరుగురు మరణించినట్లు తెలుస్తుంది. అలానే ఈ ఘటన లో ఒక మహిళ మాత్రం కొద్దిపాటి గాయాలతో బతికి బయటపడినట్లు తెలుస్తుంది. మృతుల్లో జపాన్‌దేశ వాసి ఉన్నాడని కూడా అధికారులు వెల్లడించారు. అంతకుముందు కొన్ని గంటల నుంచి జాడ తెలియని ఆ హెలికాప్టర్‌… ధాడింగ్‌, నువాకోట్‌ ప్రాంతాల వద్ద అడవుల్లో కుప్పకూలిందన్నారు. ఇతర ప్రయాణికులతో పాటు ఒక పేషెంట్‌ను వెంట తీసుకొని సామగన్‌ పరిసరాల నుంచి బయల్దేరిన వాహనం ఆ తర్వాత కాఠ్‌మాండూ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది. దుర్మరణంపాలైన వారిలో పైలట్‌ ఉన్నారని సంబంధిత విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు.