కేసీఆర్ ప్లాన్ “బి”…బీజేపీ కి “షాకే ”

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయాలు చేయడంలో దిట్ట అనే విషయం అందరికీ తెలిసిందే. తాను అనుకున్నది అయ్యే వరకూ కూడా మూడోకంటికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు..అయితే తెలంగాణలో మారుతున్న పరిణామాల దృష్ట్యా కేసీఆర్ తన ఓటు బ్యాంక్ కి ఎంటువంటి ఆటంకం కలుగకుండా జాగ్రత్తపడుతున్నారు..ఒక పక్క మహా కూటమి అంటూ కేసీఆర్ ని అన్ని పార్టీలు భయపెట్టాలని చూస్తుంటే కేసీఆర్ మాత్రం ఆ కూటమికి భయపడే ప్రశక్తే లేదని తేల్చి చెప్పేశారట..ఇక్కడి వరకూ బాగానే ఉంది ఇప్పుడు కానీ..


ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వస్తున్న కొత్త ప్రచారం..బీజేపీ నేతల్లో గుబులు రేపుతోంది..కేసీఆర్ “ప్లాన్ బి” అమలు చేయడానికి సిద్దంగా ఉన్నాడని ఈ ప్లాన్ బి తో కేసీఆర్ ఇక మీదట ముందుకు వెళ్లనున్నాడని టాక్ వినిపిస్తోంది..అయితే ప్లాన్ బి విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..ఇంతకీ కేసీఆర్ వేసిన ప్లాన్ బి అసలు రహస్యం ఏమిటి అనే విషయం తెలుసుకునే ముందు కేసీఆర్ వేసిన ప్లాన్ బి తెలుసుకోవాలి..ఇదేంటి కేసీఆర్ ప్లాన్ – ఎ ,బి లు అని ఆలోచిస్తున్నారా సరే ఆ ప్లాన్ లు తెలుసుకుంటే కేసీఆర్ బుర్ర నిండా ఎన్ని వ్యూహాలు ఉన్నాయో అర్థం అవుతుంది..సరే వివరాలలోకి వెళ్తే..


ప్లాన్ ఏ ప్రకారం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ తో అవగాహన ఏర్పరుచుకొని ముందుకు సాగుతున్నారు మజ్లిస్ పోటీచేసే ఏడు స్థానాల్లో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు…ఒక వేళ ప్రకటించినా వారు డమ్మీ అభ్యర్ధులని ప్రకటించి తెలంగాణలో ఎంఐఎం మద్దతుతో ముస్లిం ఓట్లను టీఆర్ ఎస్ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ తో చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు వెళ్లాలని అనుకున్న కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ప్లాన్ బి అమలు చేస్తున్నాడు..కేసీఆర్ ప్లాన్ బి ఏమిటింటే.


వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తో కలిసి పోటీ చేయడమే..అయితే అది కూడా అవగాహన తో పోటీ చేయడమేనట..అయితే ప్రధాని మోడీతో కేసీఆర్ ఉన్న రిలేషన్ ఆధారంగా చేసుకుని వచ్చే ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసే అవకాశం ఉందట.. కొన్ని స్థానాలను బీజేపీకి ఇచ్చి మరికొన్ని స్థానాల్లో అవగాహనతో టీఆర్ఎస్ వెళ్తుందనే ప్రచారం మొదలైంది…రాష్ట్ర అసెంబ్లీకి మజ్లిస్ తో.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో వెళుతూ కేసీఆర్ ఇద్దరు ఏపార్టీ చేయని విధంగా ఒక్క సారిగా రాజకీయ చదరంగాన్ని ఆడబోతున్నాడు కేసీఆర్.


ఈ క్రమంలోనే కేసీఆర్ మజ్లిస్ పోటీచేసే స్థానాలు.. ఇటు బీజేపీ నేతల స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించలేదు.. దాంతో మరో పక్క టీఆర్ఎస్ కి ఓటు వేస్తే బీజేపీ కి ఓటు వేసినట్టే అంటూ ప్రచారం మొదలయ్యే సరికి బీజేపీ తెగ టెన్షన్ పడుతోంది..ఈ పరిస్థితిలో ప్రజలకి బీజేపీ ఎంత వివరించి చెప్పినా అర్థం కాని పరిస్థితులు ఏర్పడటంతో ఈ చిక్కుల్లో నుంచీ ఎలా తప్పించుకోవాలోనని ఆలోచన చేస్తున్నారట బీజేపీ నేతలు.