ఆ చర్య వెనుక దేవుడు తప్ప ఎవరూ లేరట!

వాస్తవం ప్రతినిధి: బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్ధి బోల్సో నారో పై కత్తి తో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మినాస్‌ గ్రేస్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్న బ్రెజిల్‌ అధ్యక్ష అభ్యర్థి జేర్‌ బోల్సోనారోపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే ఈ దాడికి పాల్పడింది మినాస్‌ గ్రేస్‌కు చెందిన అడెలియో డీ ఒలివిరాగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల(అక్టోబర్‌)లో పోలింగ్‌ జరగనున్న క్రమంలో జేర్‌పై దాడి జరగడంతో.. ఇది ప్రత్యర్థుల పనేనంటూ సోషల్‌ లిబరల్‌ పార్టీ ఆరోపించింది. కాగా తన చర్య వెనుక దేవుడు తప్ప ఎవరూ లేరని, ఆయన ఆదేశించడం వల్లే తానిలా చేశానంటూ ఒలివిరా పేర్కొనడం విశేషం. అతడి తరపు లాయర్‌ మాట్లాడుతూ…‘ ఒలివిరా ఆవేశంలో దాడి చేశాడని, రాజకీయ, మత పరమైన నాయకులకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించాడు. ఒలివిరా మానసిక స్థితి సరిగా లేనందువల్లే ఇలా చేసి ఉండవచ్చని లాయర్ పేర్కొన్నాడు.