భారత్ బౌలర్ల ఖాతాలో అరుదైన రికార్డ్

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత పేసర్ల ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా 59 వికెట్లు పడగొట్టిన టీమ్‌ఇండియా పేసర్లు విదేశీ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన గొప్ప ఘనతను సొంతం చేసుకోగలిగారు. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా ఇషాంత్‌ 18, షమి 14, బుమ్రా 14, హార్దిక్‌ పాండ్య 10, ఉమేశ్‌ యాదవ్‌ 3 వికెట్లు తీశారు. ఈ క్రమంలో వాళ్లు 38 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ సిరీస్‌ (1979-80)లో కపిల్‌దేవ్‌ (25 వికెట్లు), కర్సన్‌ ఘావ్రి (15), రోజర్‌ బిన్ని (11) నెలకొల్పిన అత్యధిక వికెట్ల (58) రికార్డును తిరగరాశారు.