బిగ్‌బాస్‌ సెట్లో ప్రమాదం.. ఒకరు మృతి

వాస్తవం సినిమా: తమిళంలో కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి సంబంధించిన షూటింగ్‌ పూందమల్లి సమీపంలోగల సెంబరంబాక్కం ప్రాంతంలో జరుగుతోంది. ఆ ప్రాంతంలో నిన్న ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెట్లో ఏసీ రిపేర్‌ చేస్తుండగా గుణశేఖరన్‌(30) అనే వ్యక్తి మెట్లపై నుంచి జారిపడడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు అరియలూరు జిల్లా మాత్తూరు నివాసి గా తెలుస్తోంది.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు.