విజయ్‌ దేవరకొండకు మద్దతుగా సమంత!

వాస్తవం సినిమా: స్టార్ డమ్ అన్నది అంత ఈజీ కాదు. అది కేవలం రామ్ చరణ్ తోనే ఆగిపోయింది!’ అంటూ రీసెంటుగా యువహీరో నాగశౌర్య ఓ పబ్లిక్ వేదికపై చేసిన కామెంట్ అందరినీ ఆకర్షించింది. శౌర్య ఏంటి ఇలా అనేశాడు? అంటూ అనుకొన్నారు కూడా. అయితే తన ఉద్ధేశం ఏదైనా దానిని కొందరు పాజిటివ్ కోణంలో విశ్లేషిస్తే – మరికొందరు నెగెటివ్ కోణాన్ని ఎలివేట్ చేశారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన కారణంగా తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాజాగా సమంత స్టార్‌డంపై కామెంట్‌ చేసి ఆ విషయాన్ని రైజ్‌ చేసింది.
యూటర్న్‌ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సమంత మాట్లాడుతూ స్టార్‌డం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కరితో ఆగిపోదు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి స్టార్‌డం అనేది వస్తూనే ఉంటుందని, కాకుంటే కాస్త అదృష్టం కూడా దానికి కలిసి రావాలి అంటూ చెప్పుకొచ్చింది. విజయ్‌ దేవరకొండ వంటి వారు ఎంతమందైనా మంచి సినిమాలతో వస్తే స్టార్‌లు అవ్వొచ్చు అంటూ చెప్పుకొచ్చింది.

విజయ్‌ దేవరకొండతో ఈమె ‘మహానటి’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే విజయ్‌ దేవరకొండతో సమంతకు మంచి సన్నిహిత్యం ఏర్పడినది. ఆ కారణంగానే నాగశౌర్య కామెంట్స్‌కు కౌంటర్‌గా విజయ్‌కు మద్దతుగా సమంత కామెంట్స్‌ చేసిందనే టాక్‌ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.