జగన్‌ ప్రజాసంకల్పయాత్ర @ 258వ రోజు

వాస్తవం ప్రతినిధి: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకై వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 258వ రోజుకు చేరింది. ఇవాళ ఉదయం జగన్‌ విశాఖపట్నం నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గోపులపట్నం మెయిన్‌ రోడ్డు, జంక్షన్, ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా ఓల్డ్‌ కరాస వరకు పాదయాత్ర కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. మర్రిపాలెం మీదుగా పశ్చిమ విశాఖ, ఉత్తర విశాఖ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం కంచరపాలెంలో జగన్ ప్రజల నుద్దేసించి మాట్లాడతారు.