ఆసుపత్రిలో చేరిన హార్దిక్ పటేల్

వాస్తవం ప్రతినిధి: గత నెల 25 నుంచి గుజరాత్‌లో పటీదార్‌ వర్గీయులకు రిజర్వేషన్ల కోసం పటీ దార్ వర్గీయుల నాయకుడు హార్దిక్ పటేల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. శుక్రవారానికి ఆయన దీక్ష 14వ రోజుకు చేరడం తో ఆయన మరింత నీరసించారు. దీనితో హార్దిక్‌ పటేల్‌ను అనుచరులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. గురువారం సాయంత్రం నుంచి ఆయన మంచినీరు తీసుకోవడం కూడా ఆపేశారు. 24 గంటల్లో చర్చలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అంతిమ గడువు విధించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇటు హార్దిక్‌ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆసుపత్రిలో చేరాలని అనుచరులు అభ్యర్థించారని.. ఇందుకు ఆయన అంగీకరించారని పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి అధికార ప్రతినిధి తెలిపారు. హార్దిక్‌ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. హార్దిక్‌ను ఐసీయూలో చేర్చుకున్నామని.. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సోలా ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.