టెక్సాస్ లో తప్పిన పెను ప్రమాదం!

వాస్తవం ప్రతినిధి: అమెరికా లోని టెక్సాస్ లో పెను ప్రమాదం తప్పింది. ముగ్గురు విద్యార్థులు సమయస్పూర్తితో వ్యవహరించటంతో తమతో పాటు తోటి విద్యార్థులను పెను ప్రమాదం నుంచి కాపాడగలిగారు. ఈ ఘటన అమెరికాలోని ఆగ్నేయ టెక్సాస్‌లో చోటుచేసుకుంది. సాయంత్రం స్కూల్‌ పూర్తయ్యాక బస్స్‌ డ్రైవర్‌ విధ్యార్ధులను ఎక్కించుకొని బయలుదేరాడు. అయితే స్కూల్‌ నుంచి బస్సు కొద్ది దూరం ప్రయాణించాక డ్రైవర్‌ అపస్మారకస్థితిలో కి వెళ్ళిపోయాడు. అయితే దీనిని గుర్తించిన ముగ్గురు విద్యార్ధులు ఆందోళన చెందకుండా చాకచక్యంగా బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు ఆపారు. అనంతరం విద్యార్థులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కాపాడలేకపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్కూల్‌ యాజమాన్యం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల సాహసాన్ని అభినందించారు.