కేసీఆర్” కి భారీ షాక్….“మహాకూటమి” కి రంగం సిద్దం

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకో రంగు మారుతున్నాయి..కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి చేయగానే ఒక్కసారిగా టీఆర్ఎస్ నుంచీ 105 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించి మరొక సంచలనానికి తెర తీశాడు. వ్యూహాలు పన్నడంలో దిట్టగా పేరున్న కేసీఆర్ ఈ రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పెద్ద ఆంతర్యమే దాగి ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం..ఇదంతా కేసీఆర్ ,బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా అంటూ కాంగ్రెస్ మిగిలిన పార్టీ నేతలు కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు..


అయితే కేసీఆర్ చేసిన ఆ ఒక్క ప్రకటనతో తెలంగాణలో మళ్ళీ రాజకీయ వేడి రగులుతోంది ఎలాగైనా కేసీఆర్ ని గద్దె దింపాలని కంకణం కట్టుకున్నారు అందులో భాగంగానే తెలంగాణలో మహా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి..కేసీఆర్ ని ఢీ కొట్టాలి అంటే ఒక్క పార్టీ వల్ల కాదని గ్రహించిన పార్టీల అగ్రనేతలు ఇప్పుడు మహా కూటమిగా అవతరించాలానే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది…బీజేపీ, మజ్లిస్ పార్టీలు మినహా మిగిలిన పార్టీలు అన్నీ ఇప్పుడు ఒక్కటిగా కేసీఆర్ ని టార్గెట్ చేయబోతున్నాయి..


అంతేకాదు 36 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం కేసీఆర్ ని గద్దెదించడం లో ఒక భాగంగా అదేసమయంలో టీడీపీ ని తెలంగాణలో బ్రతికించుకోవడంలో భాగంగా తెలుస్తోంది.. ఇదిలాఉంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ 90 స్థానాల్లోపోటీ చేయాలని మిత్రపక్షాలకు 29 సీట్లను కేటాయించనున్నారని..టీడీపీ కి కేవలం 15 సీట్లు సర్దుబాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే టీడీపీ మాత్రం మొత్తం 20 సీట్లు కాంగ్రెస్ ని డిమాండ్ చేస్తోందట..


అయితే కాంగ్రెస్ మాత్రం టీడీపీ కి 15 మిగిలిన 14 సీట్లలో కోదండం పార్టీకి 5 నుంచి 9 సీట్లు కేటాయించే వీలున్నట్లుగా తెలుస్తోంది…“వాస్తవానికి” కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీల మధ్యపొత్తు అంశం ఎప్పుడో అయ్యిందని అయితే ఇప్పుడు మాత్రం పొత్తు గురించి కాకుండా కేవలం సీట్ల మధ్య సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమే ముఖ్యమని పార్టీల ప్రయోజనాలు పక్కన పెట్టి టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగా వ్యవహరించాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.