అంతా మన మంచికే అంటున్న మంచు మనోజ్

వాస్తవం సినిమా: తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడం మీద నటుడు మంచు మనోజ్ తనదైన శైలిలో స్పందించాడు. స్వయం పాలన కోసం ఎన్నో ఏళ్లపాటు పోరాటాలు, త్యాగాలు చేశారని కొనియాడాడు. ఈ క్రమంలో తొలి అసెంబ్లీని రద్దు చేయడం కొంత బాధగానే ఉన్నా, జరిగినదంతా మంచికే అనిపిస్తోందని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ప్రజలను బాగా చూసుకునేందుకు మీరు మళ్లీ వస్తారని భావిస్తున్నానని పేర్కొన్నాడు. దీనికి కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజలకు అభివాదం చేస్తున్న ఫొటోలను జతచేశాడు.