భద్రతా బలగాల ఆయుధాల చోరీ కి యత్నించిన ఉగ్రవాదులు….ఒకరు మృతి!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఈ తెల్లవారుజామున ఓ ఉగ్రవాది  భద్రతా బలగాల ఆయుధాలు చోరీ చేసేందుకు యత్నించారు. దీనితో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా,ఒక పోలీస్ కు గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే పరారైన ఉగ్రవాదుల కోసం బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.