వైసీపీ తీర్ధం పుచ్చుకున్న నేదురుమల్లి తనయుడు

వాస్తవం ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు వైసీపీ పార్టీలో చేరినట్లు తెలుస్తుంది. నేదురుమల్లి తనయుడు రాంకుమార్‌రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాంకుమార్‌రెడ్డికి వైసీపీ పార్టీ కండువా కప్పి స్వయంగా జగన్ సాదరంగా ఆహ్వానించారు జగన్. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 1990, డిసెంబర్ 17 నుంచి 1992, అక్టోబర్ 9 వరకు ఏపీ సీఎంగా సేవలందించారు. 1998-99 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా పని చేశారు.