లేజర్ ట్రీట్ మెంట్ తో కిడ్నీ లో రాళ్లను తొలగించిన ఉస్మానియా వైద్యులు

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ లో పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో మొట్టమొదటిసారి కిడ్నీలో రాళ్లను లేజర్ ట్రీట్‌మెంట్‌తో వైద్యులు విజయవంతంగా తొలిగించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఉస్మానియా వైద్యులు అత్యాధునిక పద్ధతులతో రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా ముగ్గురు రోగులకు ఒకే రోజు కిడ్నీల్లో రాళ్లను తొలిగించి కార్పొరేట్ ఆసుపత్రులకు తామేమి తక్కువకాదని నిరూపించారు. యూరాలజీ హెచ్‌వోడీ డాక్టర్ రామకృష్ణప్రసాద్ ఓపీలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ముగ్గురికి కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. లేజర్ ట్రీట్‌మెంట్‌తో ఒకేరోజు ముగ్గురికి విజయవంతంగా రాళ్లను తొలిగించారు.