మాటిస్ ను మార్చేయనున్న ట్రంప్!

వాస్తవం ప్రతినిధి: అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ను మార్చే ఆలోచనలో ఉన్నారు  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. మాటిస్‌తో ట్రంప్‌నకున్న విభేదాలే ఈ పరిణామానికి కారణమని శ్వేతసౌధ వర్గాలు వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన కధనంలో పేర్కొంది. ఆయనను పదవి నుంచి తొలగించాలని ట్రంప్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనాన్ని ప్రచురించింది. ట్రంప్‌ను కొన్నిసార్లు మాటిస్‌ తక్కువ చేసి మాట్లాడినట్లు.. ప్రముఖ పాత్రికేయుడు బాబ్‌ వుడ్‌వార్డ్‌ ఓ పుస్తకంలో బయటపెట్టడంతో ఈ విభేదాలు మరింత ముదిరాయని అభిప్రాయపడింది. అయితే ఈ వార్తలను ట్రంప్‌ తోసిపుచ్చారు. మాటిస్‌ పనితీరు అద్భుతంగా  ఉందని ప్రశంసించారు.