దంగల్ చిత్రంలో లాగానే హరియాణా లో కూడా!

వాస్తవం ప్రతినిధి: ‘దంగల్‌’ సినిమాలో మగపిల్లలతో.. గీతా పోగట్‌, బబితా కుమారి మల్లయుద్ధం చేయడం చూసి చాలా మంది ఒక స్పూర్తిని పొందారు. తమ పిల్లలని కూడా ఆడ మగ తేడా లేకుండా ఆ విధంగా క్రీడల్లో పాల్గొనేలా చేయాలనీ భావించారు కూడా. అయితే సరిగ్గా ఆ సినిమా లో లాగానే హరియాణా లో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ సినిమా స్ఫూర్తో లేక స్వతహాగా వచ్చిన ఆసక్తో కానీ హరియాణా నుంచి మరో అమ్మాయి అలా అబ్బాయిలతో మల్లయుద్ధం చేసి విజయం సాధించింది. ఇటీవల పంజాబ్‌లో జరిగిన మల్లయుద్ధంలో హరియాణాకు చెందిన అశ్విని అనే అమ్మాయి పోటీ పడి గెలుపొందింది. ఈ పోరుకు సంబంధించి స్థానికులు చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి వీడియోలు గతంలోనూ వచ్చిన ఇలా పూర్తి మ్యాచ్‌ ఉన్న వీడియోలు మాత్రం తక్కువగానే ఉన్నాయి.