ఎన్టీఆర్ బయోపిక్ – “అచ్చం” చంద్రబాబు లుక్ తో “రాణా”..!!

వాస్తవం సినిమా: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు సంచలనం అవుతోంది..ఈ చిత్రంలో నటిస్తున్న నటీ నటులు మొదలు చిత్రలో కాస్ట్యూమ్స్ , వగైరా అన్నీ విషయాలలో చిత్ర దర్శకుడు క్రిష్ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు..ఎన్టీఆర్ జీవితాన్ని ఇప్పటి వరకూ తెరకెక్కించిన సినిమా లేకపోవడం ఒకటైతే ఎన్టీఆర్ తనయుడు బాలయ్య తన తండ్రి జీవితాన్ని తెరకెక్కించాలని అనుకోవడం అందుకు తగ్గట్టుగా నటీనటుల్ని ఎంపిక చేసుకోవడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడుతోంది.. ఇదిలాఉంటే ఇప్పుడు ఈ బయోపిక్ విషయంలో మరొక సినిమాపై అంచనాలని పెంచేస్తోంది..ఇంతకీ అదేంటంటే.


తెలుగువారి పండుగ సంక్రాంతి అదే సమయంలో జనవరి 9న రాబోతున్న ఈ బయోపిక్ లో మరొక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు హల్చల్ చేస్తోంది బాహుబలి భాల్లాల దేవుడిగా కనిపించిన రాణా.. ఇప్పుడు క్లీన్ షేవ్ చేసుకుని మీసాలు పెంచి జుట్టు రింగులు రింగులుగా పెంచుకుని అచ్చం చంద్రబాబు లాగానే కనిపిస్తున్నాడు..ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి రానాపై పడింది..ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో రాణా సరిగ్గా సెట్ అయ్యాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి రాణా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నాడు ఈ బయోపిక్ లో రాణా ని చూస్తుంటే ఆయన పూర్తిగా చంద్రబాబులా నటించడం కాదు జీవిస్తున్నారని అంటున్నాయి సినిమా యూనిట్..ఇక బాలీవుడ్ ప్రముఖులు ఎంతో మంది ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడం ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది..ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ చిత్రం చివరి దశకు చేరుతుందోనని వేచి చూస్తున్నారు..