‘అరవింద సమేత వీర రాఘవ’ ఆడియో రిలీజ్ డేట్ ఇదే

 వాస్తవం సినిమా: త్రివిక్రమ్ దర్శకత్వంలో .. ఫ్యాక్షన్ తో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘అరవింద సమేత వీర రాఘవ’ రూపొందుతోంది. డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ దిశగా చకచకా పనులు జరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆడియో రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని ‘నోవాటెల్’ హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. సిరివెన్నెల .. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.