రిస్కీ లొకేషన్ లో రామ్‌చరణ్‌

వాస్తవం సినిమా  : బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నటిస్తోన్న తాజా చిత్ర షూటింగ్ ప్రస్తుతం అజర్‌ బైజాన్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా అక్కడా భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తేనెటీగలు ఉండే ఓ ఫామ్ పక్కనే తాజా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తేనెటీగలు రేగి అందరినీ గాయపరిచే ప్రమాదం ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులందరూ తమ పనులని ఎంతో జాగ్రత్తగా చేసుకుపోతున్నారని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు.