మమ్ముట్టి పుట్టిన రోజు సందర్భంగా ‘యాత్ర’నుండి కొత్త పోస్టర్ రిలీజ్

వాస్తవం సినిమా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించిన స్వర్గీయ వై ఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ టైటిల్ తో బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ రోజు అయన పుట్టిన రోజు. కొంతకాలం క్రితం యాత్ర సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజున మమ్ముట్టి పుట్టినరోజు కావడంతో, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెస్తూ మమ్ముట్టి ఆకట్టుకుంటున్నాడు.  మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.