11 న హైదరాబాద్ రానున్న  కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు

వాస్తవం ప్రతినిధి: నిన్న తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ ని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర సి ఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం దానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం తో గవర్నర్ కు కూడా ప్రతిని అందించారు సి ఎం కేసిఆర్. అయితే ఆ ప్రతిని కూడా గవర్నర్ ఆమోదించడం తో  తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతున్నారు. అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీ రద్దైన నేపథ్యంలో ఈ నెల 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. పర్యటన తరువాత ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యసాధ్యాలపై బృందం నివేదిక ఇవ్వనుంది.