ప్రజా ఆశీర్వాద సభలో జానా రెడ్డిపై నిప్పులు చెరిగిన కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా లోని హుస్నాబాద్‌లో తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఢిల్లీ కి వారు గులాములు అంటూ కేసీఆర్ మండిపడ్డారు. అలానే కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డిపై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కరెంట్ విషయంలో భయంకరమైన సమస్యలు ఉండే వని గుర్తు చేసిన ఆయన, తెలంగాణలో 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని తాము చెప్తే.. అధి సాధ్యమవుతదా? అని జానారెడ్డి ప్రశ్నించారని సీఎం తెలిపారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తే.. తానే గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని జానారెడ్డి నిండు శాసనసభలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. అసలు ఆయనకు నిజాయితీ ఉంటే ఆ పని చేసి చూపించాలి అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదు. కాంగ్రెస్ నేతలు కంటి వెలుగులో పరీక్షలు చేయించుకోని రాష్ర్టాభివృద్ధిని చూడాలని సీఎం వ్యాఖ్యానించారు.