కేసీఆర్‌పై లోకేశ్ తీవ్ర విమర్శలు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. అమరావతిలో మీడియాలో చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన… ఓవైపు తెలుగువారంతా కలిసిఉండాలని చెబుతున్న కేసీఆర్ మరో వైపేమో ఆంధ్రావాళ్లు భాగో, తెలంగాణ ప్రజలు జాగో అంటూ కామెంట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత మంది ఉన్నారో అందరికీ తెలుసున్న ఆయన… ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని మండిపడ్డారు. ఆంధ్ర ఓట్లు వేయించుకోకుండానే గ్రేటర్ హైదరాబాద్ ను టీఆర్ఎస్ చేజిక్కించుకుందా? అని ప్రశ్నించారు నారా లోకేష్.