కేసీఆర్ “ముందస్తు” నిర్ణయం అసలు “మతలబు”…ఇదే…!!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అసెంబ్లీ రద్దు నిర్ణయం..తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది , ఒక్క సారిగా తెలంగాణా రాజకీయాలని ఒక కుదుపు కుదిపెసిందనే చెప్పాలి..ప్రతిపక్షాల ఊహకి సైతం అందకుండా కేసీఆర్ ఇచ్చిన షాక్ తో కాంగ్రెస్ పార్టీ కి దిమ్మతిరిగిపోయిందనే చెప్పాలి..ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల కోసం తమదైన శైలిలో దూసుకువెళ్ళాలని వ్యుహాలని రూపొందిస్తుంటే మరో పక్క కేసీఆర్ ఇచ్చిన షాక్ తో ఇంకా షాక్ లోనే ఉంది..అయితే ఇంతటి నిర్ణయం కేసీఆర్ ఎందుకు తీసుకున్నారు..? ముందస్తుపై కేసీఆర్ కి ఎందుకు ఇంత నమ్మకం..? కేసీఆర్ అసలు స్కెచ్ ఏమిటి అంటే..


కేసీఆర్ చాలా కాలంనుంచీ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి రావాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాడు, అందుకు తగ్గట్టుగానే కొన్ని నెలల క్రితం కేసీఆర్ మోడీ కి వ్యతిరేకంగా మరో ఫ్రంట్ ని కేంద్రంలో తీసుకురావాలని దానికి అధ్యక్షత వహించాలని తహతహలాడాడు..ఎలాగో కొడుకు కెటీఆర్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడంతో పాటు తెలంగాణా రాజకీయాల్లో కీలక మైన వ్యక్తిగా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముద్ర వేయించుకున్నాడు ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తే లోక్ సభ ఎన్నికల నాటికి పూర్తి స్థాయి అధికారంలో ఉంటే దూకుడు చూపించి అందులో హవా చూపించాలని తద్వారా పరిస్థితులని బట్టి కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఆలోచన..

ఇదిలాఉంటే గతంలో ఎన్నో సందర్భాల్లో కేటిఆర్ 17 లోక్ సభ సీట్లలో 16 సాధిస్తామని ధీమాగా చెప్తూ ప్రతీ శ్రేణుల్లో , నేతల్లో ఉత్సాహం నింపుతూ వారిని ఎన్నికలకి సిద్దం చేస్తున్నారు అయితే కేసీఆర్ ఇంత దూకుడుగా ముందస్తుకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఒక్కటే కేసీఆర్ ప్రవేశపెట్టిన పధకాలు..కాంగ్రెస్ నేతలు సైతం పేర్లు పెట్టకుండా ఎక్కడా విమర్శలు కూడా చేయడానికి తావులేకుండా ప్రవేశ పెట్టిన పధకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు..రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు భందు ,మిషన్ భగీరధ పధకాలు టీఆర్ఎస్ ని గెలుపువైపుకి తీసుకు వెళ్తాయి అనడంలో సందేహం లేదని చెప్పాలి అయితే..

ఈ విషయాలలో క్లారిటీ గా ఉన్న కేసీఆర్ పూర్తి స్థాయిలో నివేదికలు సర్వేలు తెప్పించుకుని ఆ తరువాతే ముందస్తు కి ఒకే చెప్పాడట..ఈ వేడి ఇలా ఉండగానే ప్రజలలో కాంగ్రెస్ మార్పుని తీసుకు వచ్చేలోగానే మరొక ఆలోచన వారి మనస్సులో లేకుండా ఉండటానికి టీఆర్ఎస్ మరో సారి అధికారాన్ని చేపట్టడానికి ముందస్తు ఎన్నికలే మేలు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా అందుకే అన్ని విధాలుగా ఆలోచనలు చేసిన కేసీఆర్ ముందస్తు పై డేరింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది..అయితే కాంగ్రెస్ కి మాత్రం ఈ ముందస్తు నిర్ణయం కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయ పండితులు.