జపాన్‌లో భారీ భూకంపం..

వాస్తవం ప్రతినిధి: జపాన్‌లోని హొక్కాయ్‌డో‌ దీవిలో ఇవాళ ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. ప్రధాన నగరం సప్పోరోకు 68 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మరో 125 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది ఆచూకీ లభించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.